170వ సినిమా కోసం రంగంలోకి దిగిన రజనీ .. ఇక దీనిపైనే ఫ్యాన్స్ దృష్టి!

రజనీకాంత్ 169వ సినిమాగా వచ్చిన 'జైలర్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. 170వ సినిమాను లైకా బ్యానర్లో రజనీ చేస్తున్నారు. లైకా సంస్థలో నిర్మిస్తున్న సినిమా అంటే నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 

త్రివేండ్రంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించగా, రజనీతో పాటు మంజువారియర్ కూడా హాజరయ్యారు. 'జైలర్' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండానే రజనీ ఈ సినిమాతో రంగంలోకి దిగిపోవడం విశేషం. ఈ సినిమాలో ఆయన .. బూటకపు ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ కీలకమైన పాత్రను పోషించనున్నారు. ఇది 32 ఏళ్ల తరువాత అమితాబ్ - రజనీ కలిసి నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఇతర ముఖ్యమైన పాత్రలలో రానా .. ఫాహద్ ఫాజిల్ .. మంజువారియర్ .. దూషరా విజయన్ కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 


Rajanikanth
Amitabh Bachchan
Rana Daggubati
Fahadh Faasil

More Telugu News